సొంత గూటికి చేరిన పాలడుగు సర్పంచ్

సొంత గూటికి చేరిన పాలడుగు సర్పంచ్
-ఎమ్మెల్యే సామెల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
మోత్కూర్, ఆంధ్రప్రభ: గత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ గా గెలిచిన అంతటి భగవంతు ఆదివారం హైద్రాబాదులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో, గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే సామెల్ స్వయంగా సర్పంచ్ కి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ.. పాలడుగు కాంగ్రెస్ పార్టీలో కమిట్ మెంట్ తో పనిచేస్తున్న కార్యకర్తల పట్ల హర్షిస్తూ, గ్రామానికి సంబంధిన అభివృద్ధి పనులు,ప్రభుత సంక్షేమ పథకాల విషయంలో తన ముద్ర చూపిస్తూ,అన్ని గ్రామాలలో కెల్ల అధిక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గ్రామం మీదుగా నేషనల్ రోడ్డు వెళ్ళుచున్న కారణంగా అవతలి,ఇవతలి వైపు ప్రజలకు ఇబ్బందిని గుర్తిస్తూ అతి త్వరలోనే కొత్త వాటర్ ప్లాంట్ పనులు జరుగుతాయన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ… గత సర్పంచ్ ఎన్నికలలో కొన్ని అనివార్య కారణాల వలన రెబల్ అభ్యర్ధిగా పోటీలో నిలవాల్సి వచ్చిందని, గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేశానని,తమ గ్రామ ప్రజల అభీష్టం మేరకు సర్పంచ్ పదవి వరించింనందుకు గ్రామ ప్రజల కృతజ్ఞుతుడిగా భావిస్తూ, బాధ్యతతో గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మందుల సామెల్ నాయకత్వంలో పనిచేయుటకు సిద్ధమై తాను పార్టీలో చేరానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంతటి నర్సయ్య ,మాజీ సర్పంచ్ మర్రిపెల్లి యాదయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యాస నర్సిరెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు అంతటి వెంకటయ్య,ఉపసర్పంచ్ దడిపెల్లి సైదులు,మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల భగవంతు,గ్రామశాఖ ఉపాధ్యక్షులు కొంపల్లి గోరయ్య,యూత్ అధ్యక్షులు కొంపల్లి రమేష్ , సీనియర్ నాయకులు ముక్కముల గంగుమల్లు, మీడిదోడ్డి బిక్షం,బొంత కిష్టయ్య,ఆళ్ల సోమప్ప,కొసన ఉప్పలయ్య, మర్రిపెల్లి ఉప్పలయ్య, బొడిగె మచ్ఛగిరి,కొంపల్లి రాజారత్నం,శివరాత్రి వెంకన్న,సింగిరెడ్డి వెంకటరెడ్డి,వెంకన్న వార్డు సభ్యులు జోరుక బిక్షం,ఎమ్ డి హబీబ్, కొంపల్లి పరశురామ్ ,యాస శ్రీకాంత్ రెడ్డి,అంతటి ఉప్పేష్ తదితరులు పాల్గొన్నారు.
