డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీకాంత్ కుటుంబానికి పరామర్శ
డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీకాంత్ కుటుంబానికి పరామర్శ
పరకాల, ఆంధ్రప్రభ: గుండెపోటుతో ఇటీవల అకాలమరణం చెందిన పరకాల వాసి, హైదరాబాద్‌లో ఔషధ తనిఖీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న గుండు శ్రీకాంత్ కుటుంబాన్ని ఈ రోజు డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ (డిసిఓఐడబ్ల్యూఏ ) జాతీయ అధ్యక్షులు గుండమీది కోటేశ్వరరావు పరకాలలోని వారి స్వగృహంలో కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ తల్లిదండ్రులు, సోదరుడు, భార్య మరియు పిల్లలకు అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా రూ. 2,00,000 చెక్కును, పల్లవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని శ్రీకాంత్ భార్య శ్రీలక్ష్మి కి అందజేశారు.
తోటి అధికారుల సహకారంతో సుమారు రూ. 15 లక్షలను వారి పిల్లల భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఓఐడబ్ల్యూఏ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ నాగరాజు, మాజీ జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు, కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మృత్యుంజయ రెడ్డి, ఆర్ శ్రీనివాస్, పావుశెట్టి వెంకటేశ్వర్లు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
