అనాథ వ్యక్తి అంత్యక్రియలకు చేయూత
అనాథ వ్యక్తి అంత్యక్రియలకు చేయూత
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: గుర్తు తెలియని రైలు ఢీకొని మూడు రోజుల క్రితం మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృత దేహానికి మార్వాడి యువ మంచ్ అందించిన ఆర్ధిక సహకారంతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. బెల్లంపల్లి జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని ఒక వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరిలో భద్రపరిచారు.
సోమవారం వరకు ఆచూకీ కోసం చూడగా ఎవరు రాకపోవడంతో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ రషీద్ లు ఈ విషయాన్ని మార్వాడి యువ మంచ్ మాజీ అధ్యక్షుడు ఓంప్రకాష్ మారుకు, ఉపాధ్యక్షుడు కృష్ణ కాంత్ సోనిలకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వారు అనాధ మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు మార్వాడి యువ మంచ్ నాయకులు కలిసి అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
