22constituencies | పుదుచ్చేరిలో బీజేపీ కూటమిదే హవా
22constituencies | పుదుచ్చేరిలో బీజేపీ కూటమిదే హవా
22constituencies | కమలనాథులతో జత కట్టి పోటీ
30 సీట్లకు గాను 22 చోట్ల లీడ్
ఆరు సీట్లకే కాంగ్రెస్ పరిమితం
బోణీ కొట్టని టీవీకే పార్టీ
పుదుచ్చేరి… మొత్తం స్థానాలు 30
బీజేపీ కూటమి …. 22
కాంగ్రెస్ …7
ఇతరులు …1
22constituencies | పుదుచ్చేరి. ఆంధ్రప్రభ : పుదుచ్చేరి పీఠాన్ని బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రామస్వామి స్థాపించిన ప్రాంతీయ పార్టీతో జతకట్టి పోటీ చేసిన బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలున్న ఈ అసెంబ్లీలో రామస్వామి కూటమి 22 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలకు పరిమితం కాగా, మరో స్థానం స్వతంత్ర అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన రామస్వామి మరోసారి సీఎం కుర్చీలో కూర్చోనున్నారు..
ఇది ఇలా ఉంటే
పుదుచ్చేరి రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. 30 స్థానాలకు జరిగిన ఈ పోరులో ఓటర్లు ఎన్నడూ లేని విధంగా చైతన్యాన్ని ప్రదర్శించారు.చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో 89.87% ఓటింగ్ నమోదైంది.ఈసారి ఎన్నికల బరిలో మూడు ప్రధాన కూటములు తలపడ్డాయి. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలో ఎన్డీయే (AINRC + BJP) కూటమి పోటీలో ఉంది. ఇండియా కూటమి (కాంగ్రెస్ + డీఎంకే)తో పాటు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ కూడా ప్రధానంగా పోటీలో ఉంది. తాజా ఫలితాలలో విజయం రంగస్వామి కూటమినే వరించింది.
CLICK HERE TO READ tvkvijay | దళపతి రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టాలు!
