tvkvijay | దళపతి రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టాలు!
tvkvijay | దళపతి రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టాలు!
tvkvijay | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మొత్తం 234 స్థానాలకు గాను 110 స్థానాల్లో హీరో విజయ్ పార్టీ స్పష్టమైన అధిక్యత కనబరుస్తోంది. తమిళ పరిశ్రమలో మాస్ హీరోగా వెలిగిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ యవనికపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి అడుగడుగున ఆటంకాలు, వ్యక్తిగత విమర్శలు, ఊహించని విషాదాలు ఎదురవుతున్నా.. అవేవీ తన సంకల్పానికి అడ్డుగా భావించకుండా.. ముందుకు సాగారు. ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాలలో తనదైనా ముద్ర వేయనున్నారు.
అతిపెద్ద సవాళ్లు దాటుకొని..
ఫిబ్రవరి 2, 2024న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన నాటి నుండి ఆయన రాజకీయా ప్రయాణం చాలా ఒడిదుడుకులతో సాగింది. విజయ్ రాజకీయాల్లోకి రావడం పట్ల ప్రత్యర్థుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే గతేడాది సెప్టెంబర్ 27న నిర్వహించిన కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్షాలు, అధికార పార్టీ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటన విజయ్ ను తీవ్రంగా కలచివేసింది. ఇది ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాలుగా మారింది.
తోడుగా నిలిచిన అభిమానం..
రాజకీయ గొంతుకగా మారిన ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడటం, సినిమా విడుదలకు ముందే పైరసీ కావడం,
ఉద్దేశపూర్వకంగానే సినిమాను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే తన వ్యక్తిగత విషాయాలను (భార్యతో విడాకుల అంశం వంటి) రాజకీయం చేస్తూ కొందరు విమర్శలు గుప్పించారు. ఇన్నీజరిగినా వేటికి తల ఒగ్గకుండా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాడు. ఆయన విజయానికి అభిమానులు తోడుగా నిలించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, పొరుగు రాష్ట్రాల్లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు, తమిళనాడు రాజకీయాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. పెద్ద పార్టీల ఓట్ల శాతం మారుతున్న వేళ, ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ ఆవిర్భవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే సామాన్య ప్రజలు విజయ్ వైపు ఆశగా చూస్తున్నారని అర్థమవుతుంది.
కష్టాలు రాకుండా ఎవరూ ఎదగలేరు అన్నట్లుగా.. ఈ అడ్డంకులన్నీ విజయ్ ని మరింత పరిణతి చెందిన నాయకుడిగా మారుస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
