crime | మృతదేహాన్ని తరలించే యత్నంలో…
crime | మృతదేహాన్ని తరలించే యత్నంలో…
crime | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్ అంబేడ్కర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన కుమారుడితో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అనంతరం మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40)తో ఆ మహిళ గత పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ సమయంలో ఆమె కుమారుడు కూడా వారితో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల శివారెడ్డి తల్లి, కుమారుడిని వేధిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మటన్ కోసే కత్తితో శివారెడ్డిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని సంచిలో మూటగట్టి బయటకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన స్థానికుల సమాచారంతో జీడిమెట్ల పోలీసులు అక్కడికి చేరుకుని తల్లి, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
