3sixes | కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం

3sixes | కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం

3sixes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హెడ్ కేవలం 28 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే, హెడ్ అవుటైన తర్వాత హైదరాబాద్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి (3/36) తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. నిర్ణీత 19 ఓవర్లలో సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్ అయింది.

3sixes |
3sixes |

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్లు అజింక్య రహానే (43), ఫిన్ అలెన్ (29) మంచి పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ బాధ్యతాయుతంగా ఆడి 59 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో కేకేఆర్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

CLICK HERE TO READ MORE : 1stwicket | రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్‌

CLICK HERE TO READ MORE :