ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

చిట్యాల, ఆంధ్రప్రభ: మున్సిపాలిటీ పరిధిలోని మే ఒకటో తారీఖున జరిగిన శ్రీ బాల నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. ఈ విషయం పై ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ వెంకన్నకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పందిరి రమేష్, గుండెబోయిన సైదులు, ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, బొబ్బలి రామ్ రెడ్డి, జిట్ట రవి, షేక్ ఇబ్రహీం, కంబంపాటి సతీష్, ఆగు వెంకన్న, తదితరులు ఉన్నారు.