చదువుల తల్లికి సన్మానం..

చదువుల తల్లికి సన్మానం..

మచిలీపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మచిలీపట్నం పట్టణం ఫస్ట్, కృష్ణాజిల్లా ద్వితీయ స్థానం రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానాన్ని పొంది 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించుకున్న బొల్లా హాసిని నీ ఆదివారం కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గొర్రెపాటి గోపీచంద్ మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ ఘనంగా సన్మానించి నూతన దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా గొర్రిపాటి గోపీచంద్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫలితాలు ప్రభంజనం సృష్టించాయని ముఖ్యంగా ఆడపిల్లలు అగ్రస్థానంలో మార్కులు సంపాదించడం ఆనందదాయకమని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అగ్రపీఠం వేయటం జరుగుతుందని గోపీచంద్ అన్నారు.

మచిలీపట్నం ఏ లిటిల్ ఫ్లవర్ ది లీడర్ స్కూల్లో చదివి 597 మార్కులు సాధించిన హాసిని నేటి తరానికి ఆదర్శప్రాయమని లంకి శెట్టి బాలాజీ అన్నారు. నిరుపేద గ్రామీణ ప్రాంతం లో పుట్టిన విద్యల్లో అగ్రస్థానం నిలవడం ఆమె ప్రతిభకు తార్కానమ్ అని బాలాజీ అన్నారు.

జిల్లా స్థాయి మొదటి ర్యాంకు మచిలీపట్నానికి రావడం మచిలీపట్నానికే గర్వకారణం అని బాలాజీ అన్నారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు పొందిన హాసిని నీ కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించాలని బాలాజీ కోరారు. ఈ కార్యక్రమంలో హాసిని తల్లిదండ్రులు బొల్లా బాజీ బాబు దంపతులు, నాగరాజు, ఎం.వి.వి రామాంజనేయులు బాబు, తాడేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.