దంతన్‌పెల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్‌పెల్లి గ్రామంలో పిల్లల రక్షణ, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అంకవ్వ, ఉపసర్పంచ్ మహ్మద్ ముబీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ మాట్లాడుతూ.. పిల్లల భద్రత, సంరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆదిలాబాద్ జిల్లా సభ్యులు, వీవో సంఘ నాయకురాలు, ఐకేపీ సీసీలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply