విద్యుత్ వైర్లు తగిలి గడ్డిలోడు బొలెరో దగ్ధం..
విద్యుత్ వైర్లు తగిలి గడ్డిలోడుబొలెరో దగ్ధం..
15 లక్షలు ఆస్తి నష్టం
కోసిగి, ఆంధ్రప్రభ : కోసిగి మండలం పరిధిలోని చిర్తన కల్లు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడుతో ఉన్న కొత్త బొలెరో వాహనం పూర్తిగా దగ్ధం మై 15 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. చిర్తన కల్లు గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కొత్త బోలోరా వాహనం ఇటీవలే కొనుగోలు చేశాడు. అయితే పశువుల కు మేత అవసరమై మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో గడ్డిని కొనుగోలు చేసి కొత్త బొలెరో వాహనంలో గ్రామానికి తీసుకు వస్తుండగా గ్రామ శివార్లలో ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా మంటలు వ్యాపించడం తో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆదోని ఫైర్ ఇంజన్ వారికి సమాచారం ఇచ్చారు. అప్పటికే పూర్తిగా గడ్డితోపాటు, బొలెరో వాహం కాలిపోయిన ట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
