10 acres | బతుకమ్మకుంటపై హైడ్రా వివరణ
10 acres | బతుకమ్మకుంటపై హైడ్రా వివరణ
10 acres | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైడ్రా పేదలపైనే చర్యలు తీసుకుంటూ పెద్దల్ని వదిలేస్తుందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నిబంధనల ప్రకారం ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట చెరువును హైడ్రా పునరుద్ధరించడంపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లిన విషయం విదితమే. దీనిపై హైడ్రా కమిషనర్ రంగానాథ్ మీడియాతో మాట్లాడారు.
అక్కడ అసలు చెరువే లేదంటూ దాఖలైన పిటిషన్‌కు విరుద్ధంగా, సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 10 ఎకరాల చెరువు ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
బతుకమ్మకుంట చెరువును హైడ్రా పునరుద్ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లో అక్కడ అసలు చెరువు లేదని పేర్కొన్నారని రంగనాథ్ చెప్పారు. అయితే సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆ ప్రాంతంలో 10 ఎకరాల చెరువు ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
వరదల నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, డివిజన్ బెంచ్ ఉత్తర్వులను పూర్తిగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, వరద ముప్పు నివారణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
