May4 | అప్పటి వరకు అవకాశం

May4 | అప్పటి వరకు అవకాశం

May4 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఊరట లభించింది. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం మే 4 వరకు పొడిగించింది. దీంతో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మరో అవకాశం లభించింది.

ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ గడువులోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు.

అయితే ఈ గడువులో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆలస్య రుసుముగా రూ.3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని సూచించారు.

Leave a Reply