ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్గా ఎన్. కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ…..
ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్గా ఎన్. కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ…..
మేడ్చల్, :(ఆంధ్రప్రభ):మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట మున్సిపల్ నూతన కమిషనర్గా ఎన్. కృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పూర్వ కమిషనర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆయనకు సిబ్బంది మరియు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత, తాగునీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,చైర్ పర్సన్ లావుడ్య శ్రీదేవి రమేష్ నాయక్ , వైస్ చైర్ పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
