Accident | కూలీలపైకి దూసుకెళ్లడంతో…

Accident | కూలీలపైకి దూసుకెళ్లడంతో…

Accident | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళలపైకి ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు.

తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను వెంటనే విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply