Revanth Reddy | కేసీఆర్ మా రాజకీయ ప్రత్యర్థి మాత్రమే

Revanth Reddy | కేసీఆర్ మా రాజకీయ ప్రత్యర్థి మాత్రమే
Revanth Reddy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి ఇక మనుగడ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని అహంకారంతో వ్యవహరించారని, అందుకే ప్రజలు వారిని అధికారంలో నుంచి దించేశారని అన్నారు.
కేసీఆర్, ఆయన పార్టీతో ప్రజలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ తమకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని తాను కోరుకుంటానని, చనిపోవాలని ఎందుకు కోరుకుంటానని ప్రశ్నించారు.
వారసత్వ సంపద కోసం వారి కుటుంబ సభ్యులే అలా కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైడ్రా ద్వారా అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతల భూములు పోతుండటంతోనే వారు గంగలో కలుపుతామని అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
