శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించండి

కార్మిక సంఘంజిల్లా ఉపాధ్యక్షుడుచెన్నప్ప

ఊట్కూర్, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ) శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులందరూ సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు ఎల్కోటి చెన్నప్ప డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో (టి యు సి ఐ) ఆధ్వర్యంలో సంతబజార్ చౌరస్తాలో 140వ మే డే సందర్భంగా గోడ పత్రిక, గోడపత్రికలువిడుదల చేశారు.ఈ ఆయన మాట్లాడుతూ జిల1886లో కార్మికుల నాయకుల త్యాగాలతో రక్త తర్పణతో నిరుపెక్కిన ఎర్రజెండా సుత్తి కొడవలి జెండా కార్మిక జెండా కార్మిక హక్కులనుపోరాడి సాధించుకున్న రోజు మే 1, ఎన్ని గంటల పని దినం అమలు చేయాలని పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మన స్థానాల్లో మెరుగైన పరిస్థితులు కల్పించాలని పెట్టుబడిదారుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడిన సాధించుకున్న దినం మే ఒకటి, కార్మికులకు స్ఫూర్తిదాయకమైనదని అన్నారు. భారతదేశ కార్మిక వర్గం సాధించకున్న హక్కులను ప్రభుత్వలు కాలరాస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంవిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ లను తీసుకువచ్చిందని మండిపడ్డారు. పని గంటల పెంపు సమ్మె హక్కును కాలరాస్తూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ పని చేయిస్తూ కార్మిక వర్గాన్ని మరింత శ్రమ దోపిడీకే గురి చేస్తున్నారన్నారు. ఈ సమావేశ కార్యక్రమంలో టి యు సి ఐ మండల నాయకులు సుశాంత్, ఊట్కూర్ తాపీ మేస్త్రి సంఘం మాజీ అధ్యక్షుడు కూతలి నాగేష్,ఆంజనేయులు బిఆర్ఎస్ మాజీ నాయకులు కృష్ణ మీనన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.