త్వరితగతంగా పనులు పూర్తి చేయాలి

త్వరితగతంగా పనులు పూర్తి చేయాలి

  • సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ పట్టణంలో కొనసాగుతున్న కోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతంగా పూర్తి చేయాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మండలాధికాలను ఆదేశించారు. పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న కోర్టు నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను గూర్చి ఎంపీడీవో సంతోష్ ని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయించి ప్రజలకు కోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మండల అధికారులకు సూచించారు. జడ్జి వెంట ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ ఉపాధ్యక్షుడు సుదర్శన్ ప్రధాన కార్యదర్శి శంకర్ సంయుక్త కార్యదర్శి నాగరాజ్ ఎంపీడీవో సంతోష్ కుమార్, స్థానిక లాయర్లు గజ్జల చైతన్య, సూర సురేష్ తదితరులు ఉన్నారు