డివైడర్‌ను ఢీ…

డివైడర్‌ను ఢీ…

యువకుడికి తీవ్ర గాయాలు…

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల పరిధిలోని ఎల్లంపేట మునిసిపల్ పరిధికి సంబంధించిన జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కండ్లకోయ పట్టణానికి చెందిన ప్రవీణ్ రెడ్డి అనే యువకుడు తన బైకుపై వెళ్తుండగా, డబ్బిల్పూర్ చౌరస్తా సమీపంలోని శ్రీరామ స్పిన్నింగ్ మిల్ వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది.

వేగంగా ఉన్న బైక్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో ప్రవీణ్ రెడ్డికి శరీర భాగాలతో పాటు తలకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply