పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది..

పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోనీ కోడిచెర్ల గ్రామంలో ఇందిరమ్మల లబ్ధి దారులు నిర్మించుకున్న గృహాలను గృహం సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వేల్పూర్ శ్రీనివాస్ ప్రారంభించారు. మొట్టు పురుషోత్తం అనే లబ్ధిదారులు ఇందిరమ్మ గృహాలను నిర్మాణం పూర్తి చేసుకున్నందున వాటి ప్రారంభోత్సవానికి సర్పంచ్ వేల్పూర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ ప్రభుత్వం రాకముందు 9 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పేరుతో చాలామంది ఆశావాదులు అందరు కూడా నిరాశ ఎదుర్కొన్నారు అని అన్నారు. ఉండడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వారికి గృహాలను మంజూరు చేసి పేదల కలను నిజం చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. గత 70 సంవత్సరాలనుండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదవారికి న్యాయం చేసింది అన్నారు.
గత ప్రభుత్వం పది సంవత్సరాలు గృహ నిర్మాణం చేస్తున్నామని సాగదీస్తూ కాలయాపన చేసి అనర్హులకు కట్టబెట్టిందని అన్నారు.. పేదల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని ఈ గృహాల నిర్మాణమే నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. పేదల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క హౌసింగ్ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అలాగే బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ చూపిస్తున్న అభిమానానికి పేద ప్రజలకు కలలు నిజం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిబద్ధత పూర్తి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెట్టు ప్రసాద్,వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి,గ్రామపంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
