దరువు జాతర’ను విజయవంతం చేయండి….

దరువు జాతర’ను విజయవంతం చేయండి….

అమరవరపు సతీష్

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఈ నెల 20న నిర్వహించనున్న ‘దరువు జాతర’ను జయప్రదం చేయాలని సతీష్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్, ప్రముఖ డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ కోరారు. దరువు వేదిక 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకకు ఉద్యమకారులు, కళాకారులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ​

తెలంగాణ మలిదశ ఉద్యమంలో డా. దరువు ఎల్లన్న, దరువు అంజన్నలు ప్రజా పక్షాన నిలిచి సాంస్కృతిక చైతన్యాన్ని నింపారని సతీష్ కొనియాడారు. ఈ సందర్భంగా ‘వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం’ అనే ప్రత్యేక వీడియో సాంగ్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీరబాబు, శోభన్, సాయి, నాగమణి, కల్పన, రాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply