గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం

గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం

  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

చెన్నూర్ ఆంధ్రప్రభ : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయినా నిధులతో చెన్నూరు నియోజకవరంగంలో జరుగుతున్నా అభివృద్ధి పనులను నేనే అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివేక్ చెప్పుకోవడం హాస్యాస్పదం ఉందని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. స్థానిక మాజీ వార్డు కౌన్సిలర్ తుమ్మ రమేష్ తో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీలోచేరారు.పార్టీలో చేరిన వారికి సుమన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా సుమన్ మాట్లడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిపోయింది.గతంలో బిఆర్ఎస్ పార్టీ తెచ్చిన నిధులతోనే ప్రస్తుతం మంత్రి వివేక్ పనులు చేస్తున్నారు.అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి కొత్త నిధులు ఏమీ తీసుకురాలేదని నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలను మంత్రి వివేక్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని ఆపి వేయడం తోపాటు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 500 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో ఏర్పాటు చేయదలచిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం నుంచి ఫ్యాక్టరీ తరలి వెళ్ళిపోయిందన్నారు.ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా నిర్లక్ష్యానికి గురైన తరుణం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు.

Leave a Reply