జిల్లాలో యువకుడి దారుణ హత్య

జిల్లాలో యువకుడి దారుణ హత్య

  • వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లాలో ఓ యువకుడు దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నంద్యాల మండలం కొత్తపల్లి మెట్ట సమీపంలో యువకుడిని ఆదివారం కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. నంద్యాల తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా 28 గా పోలీసులు గుర్తించారు. రహదారిలో అతనిని వెంటాడి కత్తులతో హత్య చేసినట్లు ఆనవాళ్లు లభించాయని పోలీసులు తెలుపుతున్నారు. పొట్టలోని భాగాలు కూడా బయటికి వచ్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

మృతుడి కుటుంబ సభ్యులు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. సభ్యులు కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నా రు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం మొత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు.

Leave a Reply