HMDA | ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు..

HMDA | ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు..
HMDA | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌ల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. నాగోల్–ఉప్పల్–హబ్సిగూడ, బోడుప్పల్–ఉప్పల్–రామంతపూర్ మార్గాల్లో భారీ రద్దీ ఉంటుందని, ఘట్‌కేసర్ నుండి వచ్చే భారీ వాహనాలను నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లిస్తారని తెలిపారు. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించడం మంచిది.
ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను HMDA ఉప్పల్ భాగ్యత్ వద్ద మెహఫిల్ హోటల్ మీదుగా నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లిస్తారు. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద బోడుప్పల్, చెంగిచెర్ల, చెర్లపల్లి వైపు మళ్లిస్తారు. తార్నాక, రామంతపూర్ నుండి హబ్సిగూడ, నాచారం, NFC రోటరీ, చెర్లపల్లి మార్గాల్లో మళ్లిస్తారు. లారీలు, ట్రక్కులు, డంపర్లు, టిప్పర్లు, ప్రైవేట్ బస్సులకు ఉప్పల్ స్టేడియం వైపు అర్థరాత్రి వరకు ప్రవేశం లేదు.
వరంగల్-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారు ఘట్‌కేసర్ లేదా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద అవుటర్ రింగ్ రోడ్ (ORR) ఉపయోగించాలని సూచించారు. స్టేడియం బయట 5 ప్రధాన పార్కింగ్ ప్రాంతాలు (A, B, C, D, E) కేటాయించారు.
