ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతులకు ఊరటనిచ్చే విధంగా వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. వడ్లూరు గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని, బెజ్జంకి కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు సరైన ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను విక్రయించవచ్చని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ, మాజీ ఎంపిపి బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, సర్పంచ్ బొల్లం శ్రీధర్ నాయకులు ఐలేని శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు రైతులు పాల్గొన్నారు.
