నైన్ పాకలో ప్రారంభించిన సర్పంచ్ భాస్కర్

చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు నైన్ పాక బస్టాండ్ కూడలిలో శనివారం చలివేంద్రంఏర్పాటు చేసినట్లుగ్రామ సర్పంచ్ నక్క భాస్కర్ యాదవ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… చలివేంద్రం ఏర్పాటు వేసవి కాల ఎండల తీవ్రత నేపథ్యంలో*ప్రజల దాహాన్ని తీర్చాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు , గ్రామ ప్రజలకు దాహాన్ని తీర్చే విధంగా కొత్త కుండలలో మంచినీటి సౌకర్యాన్ని , గ్రామ బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామఉపసర్పంచ్ గడ్డి రాములు, గ్రామ వార్డు మెంబర్ సభ్యులు నూక రజిత-వీరన్న, నా పాక గుడిచైర్మన్ కట్టె కొల్ల మొండయ్యఅర్చకులు పెండలప్రభాకరచార్యులు ,గ్రామ పంచాయితీ కార్యదర్శి విష్ణువర్ధన్,తొట్ల ఎర్రయ్య, రాయారాకుల రమేష్, నగునూరి వెంకటేశ్వర్లు ,నూక రాజు, గొర్రె అనిల్ యాదవ్, తొట్ల మల్లయ్య, కారోబార్ శంకర్, గ్రామ అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply