మెథడిస్ట్ చర్చి నిర్మాణానికి బీఆర్ఎస్ నేత విరాళం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న మెథడిస్ట్ చర్చి కోసం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ విరాళం అందజేశారు. చర్చి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుడు అనిల్ విజ్ఞప్తి మేరకు ఆయన తన వంతుగా రూ.20వేల విలువైన చెక్కును అందించారు. ఈ చెక్కును చర్చి పాస్టర్ పి.సుందర్ రాజ్, అల్లిపూర్ పాస్టర్ సామ్యూల్, రాజు చర్చి లేమన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్ కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా చర్చి నిర్మాణానికి సహకరించిన తట్టు నారాయణకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
