జిల్లాలో పండుగ వాతావరణం..

జిల్లాలో పండుగ వాతావరణం..

రాప్తాడు, ఆంధ్రప్రభ : జిల్లాలోని పేద కుటుంబాలకు, విద్యార్థులకు, అనాధలకు అండగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేస్తున్నఆర్డీటీ సంస్థ ఎఫ్.సి.ఆర్.ఏను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ (రెన్యువల్) చేయడం వలన విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ లను ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మేధావులకు, వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటి) నిరంతరం ప్రజా సేవలోనే ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో ఒక్కసారిగా పండుగ వాతావరణం ఏర్పడింది. గ్రామస్థాయి నుండి జిల్లా వరకు నలుగురు వ్యక్తులు కలిసిన ప్రతి చోటా ఆర్డీటి సంస్థ రెన్యువల్ గురించి సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. గ్రామాలలోని ఆర్డీటి మహిళా సంఘాలు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply