కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు

కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు

  • మరమ్మత్తులు చేయాలనీ గ్రామ ప్రజల విజ్ఞప్తి

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో ఉన్న కాకతీయుల కాలం నాటి చారిత్రక బురుజు ప్రస్తుతం ఘతపాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు గ్రామ చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ పురాతన నిర్మాణం సంరక్షణ లేకపోవడంతో క్రమంగా కూలిపోయే పరిస్థితికి చేరుకుంది.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈబురుజును పునరుద్ధరించి, భావితరాలకు తెలంగాణ గొప్ప చరిత్రను తెలియజేసే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు చింతల నరేష్, గ్రామస్థులు కోరుతున్నారు. చారిత్రక సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బురుజుకు మరమ్మత్తులు చేయాలి: చింతల నరేష్
కుర్చపల్లిలో ఉన్న కాకతీయుల కాలం నాటి చారిత్రక బురుజు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నిర్లక్ష్యంతో పాడైపోతున్న ఈ చారిత్రక కట్టడం గ్రామ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ బురుజును తక్షణమే మరమ్మత్తులు చేసి సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply