జంట మరణాల సంఘటన కలచివేసింది – ఉప్పాల రాము

జంట మరణాల సంఘటన కలచివేసింది – ఉప్పాల రాము

గూడూరు – ఆంధ్రప్రభ : గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామ శివారులో నిన్న మధ్యాహ్నం సంభవించిన జంట మరణాల సంఘటన నన్ను ఎంతగానో కలచివేసిందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. మరణంలోనూ వీడని వీరి బంధం అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply