వర్షాకాలానికి ముందే ముందస్తు చర్యలు

వర్షాకాలానికి ముందే ముందస్తు చర్యలు
వేంసూరు, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వేంసూరు సర్పంచ్ మహ్మద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వర్షపు నీరు, నివాస గృహాలలో వినియోగించిన నీరు నిల్వలు లేకుండా పారుదలకు సమగ్రమైన ప్రణాళికతో డ్రైనేజీ ఏర్పాటును ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డెంగీ, మలేరియా జ్వరాలు వంటివి గ్రామ ప్రజలకు రాకుండా నివారించే, చర్యలలో భాగంగా డ్రైనేజీ పూడికతీతలు, డ్రైనేజీ ఏర్పాటు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే గ్రామంలో సిసి రోడ్లు, మిడిల్ పోల్స్ ఏర్పాటు, త్రాగునీటి చర్యలు, పైపులైన్ ఏర్పాట్లు వంటి అనేక పనులు నిర్వహిస్తున్నారు.
