ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోరటికల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ స్థానిక సర్పంచ్ అద్దంకి రామలింగయ్యతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ అద్దంకి రామలింగయ్య మాట్లాడుతూ.. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సరైన ప్రదేశంలోనే నిల్వ చేయాలని, మార్గమధ్యంలో ఎక్కడా ధాన్యం చెల్లాచెదురుగా పోయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఏఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ధాన్యాన్ని సరైన తేమ శాతం ఉండేలా ముందుగానే బాగా అరబెట్టుకోవాలని, తాలు లేకుండా శుభ్రంగా ఉంచాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం గోసుల భాస్కర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సర్పంచ్ అద్దంకి రామలింగయ్య,ఉప సర్పంచ్ మందుల అంజయ్య,వార్డ్ మెంబర్లు దండు లింగస్వామి,బొల్లం యాదయ్య,పంచాయతీ కార్యదర్శి సోమనబోయిన శ్రీనివాస్,ఏ ఈ ఓ వెంకటేశ్వర్లు,సిసి కోరే యాదయ్య,సంఘ బంధం అధ్యక్షురాలు యాదమ్మ,వివోఏ రోజా, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply