దండేపల్లిలో మక్కల లారీ బోల్తా..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని మెదరిపేట గ్రామ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు మక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
జన్నారం నుంచి లక్షెట్టిపేట వైపు మక్కల లోడుతో వెళ్తున్న లారీ (టీఎస్ 08 యూహెచ్ 0009) మెదరిపేట వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా పక్కకు ఒరిగిపోవడంతో మక్కలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలే కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
