నిబంధనలను అతిక్రమించే ఎరువుల డీలర్లపై చర్యలు తప్పవు
నిబంధనలను అతిక్రమించే ఎరువుల డీలర్లపై చర్యలు తప్పవు
- డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్ రావు
- పురుగుల మందుల దుకాణాలను తనిఖీ చేసిన ఏడివో, ఏవో
కేసముద్రం, ఆంధ్రప్రభ : నిబంధనలను అతిక్రమించే ఎరువులు , పురుగుల మందుల డీలర్లపై చర్యలు తప్పవనీ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్ రావు హెచ్చరించారు. బుధవారం కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్ రావు , మండల వ్యవసాయ అధికారి బి వెంకన్నతో కలిసి పత్తి విత్తనాలకు సంబంధించి ఇన్వైసులు, స్టాక్ రిజిస్టర్లు సోర్స్ సర్టిఫికెట్ పరిశీలించడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విత్తన డీలరు స్టాక్ రిజిస్టర్లు, ఇన్వైసులు, పిసి లు మెయింటెన్ చేయాలని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు.
డీలర్లు ఎవరైనా నియమ నిబంధనలను అతిక్రమించి నట్లయితే విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అదేవిధంగా రైతులు ప్రభుత్వంచే అనుమతి పొందిన అదికృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. విధిగా బిల్లులు తీసుకోవాలని కోరారు. రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు వేసుకోకూడదని, అలా వేసినట్లయితే విత్తనం యొక్క జన్ను స్వచ్ఛత లోపించడం, మొలక శాతము తక్కువగా రావడం జరిగి దిగుబడును తగ్గే అవకాశం ఉన్నందన్నారు . రైతు సోదరులు 60 మిల్లీమీటర్ల వర్షపాతం రెండుసార్లు పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా రైతులు భూసారని పెంపొందించడానికి పచ్చి రొట్టె విత్తనాలు అయినా జీలుగా, పెసర వంటి విత్తనాలను వాడి పూత సమయంలో భూమిలో కలియ దున్నడవలన భూసారం పెరిగి మంచి దిగుబడును వస్తాయని తెలిపారు. గ్రామాలలో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు గాని , లేబుల్ లేకుండా ఎవరైనా అమ్మినట్లైతే వాటిని కొనుగోలు చేయరాదని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు , పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా గ్లైపోసిట్ నిషేధిత బిజీ 3 పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేనందున రైతులు అటువంటి పత్తి విత్తనాలను కొనకూడదని, వేసి మోసపోకూడదని తెలిపారు.
