విద్యార్థులకు ఉచితంగా టీఎల్ ఎం విరాళం..

విద్యార్థులకు ఉచితంగా టీఎల్ ఎం విరాళం..

ఉదారత చాటుకున్న డిసైడ్ హై స్కూల్ హెచ్ఎం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సేవ చేయాలన్న తలంపు ఉండాలె కానీ ఈ కార్యక్రమానికైనా సేవ చేయవచ్చు. పదవీ విరమణ చెందిన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సూర్య పోగు ఐజయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తన వంతు కర్తవ్యం గా పాఠశాలలో చదువుకు సంబంధించిన మెటీరియల్‌ను అందజేసి ఉదారత చాటుకున్నాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు.

బుధవారం పొన్నాపురం హైస్కూల్ రిటైర్డు ప్రధానోపాధ్యాయులు సూర్యపోగు ఐజయ్య రాయమాల్ పురం మోడల్ ప్రైమరీ పాఠశాలకు సుమారు ఆరు వెల రూపాయలు విలువైన1 మరియు 2 తరగతుల విద్యార్థులకు అవసరమయ్యే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను అందజేశారు. ఈ మెటీరియల్ ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలకు దాతలు మరింత ముందుకు రావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, ఓబయ్య, సత్యవతమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply