ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే…
మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎండాకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయడంలో ఆలస్యం జరుగుతోందని, నాణ్యత (మాయిశ్చర్) పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తూకం ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు కేంద్రంలో తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే రైతులు ధాన్యాన్ని సరిగా ఎండబెట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం తమ వంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
