గాలికుంటు నివారణ టీకాలను సద్వినియం చేసుకోవాలి

టేకుమట్ల,ఆంధ్రప్రభ : గాలికుంటు నివారణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వేలంపల్లి సర్పంచ్ కూర వెంకట రాజిరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వేలంపల్లి గ్రామంలో పశు వైద్యుడు వివేక్ ఆధ్వర్యంలో ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాలికుంటు నివారణ టీకాలు వేశారు.
ఆవులకు, దూడలు బర్రెలు, గేదెలతో పాటు ఆయా రకాల పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించవలసిన అవసరం మన అందరిపై ఉందని, పశువైద్య శాఖద్వారా గ్రామాలవారిగా కొనసాగే ఇట్టి టీకాల కార్యక్రమాన్ని పశువుల పెంపకందారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంపద సహాయకులు దాసరి శంకర్, గోపాలమిత్రలు కుమారస్వామి, రాజేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
