అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం…

అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం…

కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ చిట్టినగర్‌లోని మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో భారత రాజ్యాంగ రూప శిల్పి, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నిర్దేశించిన మార్గం సమాజానికి దిశానిర్దేశకమని, ఆయన ఆలోచనలు, ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కొల్లి ఈశ్వర బాబు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ సేవలు అపారమని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధికారులు, రిటైర్డ్ ఉద్యోగి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply