ప్రజాస్వామ్యానికి పునాది అంబేద్కర్ సిద్ధాంతాలు..

ప్రజాస్వామ్యానికి పునాది అంబేద్కర్ సిద్ధాంతాలు..
నాయబ్ తహసీల్దార్ భీష్వ
అచ్చంపేట, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ తహసీల్దార్ భీష్వ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానం మనిషి జీవితానికి పునాది అని, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛే నిజమైన ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు అపారమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, జీపీఓ రవీందర్, రికార్డ్ అసిస్టెంట్లు బి. ఆంజనేయులు, ఎస్.కె సలీం తదితరులు పాల్గొన్నారు.
