రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత..!

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత..!
- ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
- మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ సాగర్
మాక్లూర్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ సాగర్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలొ భాగంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘అరైవ్ అలైవ్’ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని , ప్రతి ఒకరూ రూల్స్ పాటిస్తూ.. కుటుంబ సభ్యులు, ఇతరులు కూడా రూల్స్ పాటించేలా కృషి చేయాలని సూచించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను వివరించి, కుటుంబాలను కోల్పోయిన బాధితుల ఆవేదనను వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణ భద్రతను కాపాడుకోవాలని పేర్కొన్నారు.
మద్యం తాగి వాహనాలు నడపకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రవాణా శాఖ చట్టాలను వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అసుపత్రికి తరలిస్తే నగదు తో పాటు ప్రశంస పత్రం అందించనున్నట్లు తెలియజేశారు. ఇందులో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రావు, ఇంచార్జ్ ఎంపీఓ రాకేష్, ఉప సర్పంచ్ ఆరీఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
