అంబేద్కర్ విగ్రహానికి 25వేల విరాళం..

అంబేద్కర్ విగ్రహానికి 25వేల విరాళం..
వెల్దండ, ఆంధ్రప్రభ : అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వెల్దండ మండల పరిధిలోని చల్లపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహానికి బొల్లంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాష్ 25 వేల రూపాయల విరాళాన్ని అంబేద్కర్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గ్రామస్తులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
