annabhau | సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి!

annabhau | సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి!

annabhau | నిజామాబాద్‌లో అట్టహాసంగా సాఠే విగ్రహావిష్కరణ మహోత్సవం
సామాజిక న్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావు
సమానత్వం కోసం సాఠే చేసిన కృషి అజరామరం

దళిత సాహిత్యానికి అన్నాభావు సాఠే దిశానిర్దేశం:

టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్‌లో అత్యంత వైభవంగా సాఠే విగ్రహావిష్కరణ

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సమన్యాయానికి కట్టుబడి ఉంది:

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావు

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 12 ఆంధ్రప్రభ: దేశంలో దళిత సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు అన్నాభావు సాఠే అని టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ మున్సిపల్ పార్క్ ఎదుట ప్రముఖ సామాజిక సంస్కర్త డాక్టర్ అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావు హాజరయ్యారు.

annabhau
annabhau

అణగారిన వర్గాల ప్రతిబింబం సాఠే: బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేదలు, అణగారిన వర్గాల జీవన వాస్తవాలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప రచయిత అన్నాభావు సాఠే అని అన్నారు. సామాజిక అసమానతలపై కలం ద్వారా పోరాడిన ప్రజా కవి ఆయన అని, సమానత్వం, మానవ హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ నినాదం ప్రకారం ఎవరి వాటా ఎంత ఉందో వారికి అంత మేలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. రాజకీయాలు ఎన్నికల వరకే.. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే మా ధ్యేయం” అని స్పష్టం చేశారు.

annabhau
annabhau

సామాజిక మార్పుతోనే నిజమైన ప్రగతి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. సాఠే విగ్రహం నిరంతరం పోరాట పటిమను గుర్తు చేస్తుందని, మాదిగ సామాజిక వర్గ ప్రతినిధులు తమ ప్రాంతాల అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు

Leave a Reply