దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్…

దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్…

దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దమ్మపేట మండల విద్యార్థినిలు స్టేట్ ర్యాంకు సాధించారు. అశ్వారావుపేట వీకేడీవి కళాశాలలో చదువుతున్న దమ్మపేట మండలం అప్పారావుపేటకు చెందిన శెట్టిపల్లి మోక్షిత ఇంటర్ ప్రథమ ఎంపీసీ లో 468/470 స్టేట్ సెకండ్ ర్యాంక్, దమ్మపేట మండలం మొద్దులగూడెం కు చెందిన మలిశెట్టి ధన తేజస్విని ఇంటర్ ప్రథమ బైపీసీ నుండి 438/440 స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు .

దమ్మపేట మండల విద్యార్థినిలు స్టేట్ ర్యాంకు లు సాధించటం పట్ల వీకేడీవి కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు , అధ్యాపక బృందం , తల్లిదండ్రులు , మండల ప్రజలు విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలిపారు .

Leave a Reply