నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…

నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…

గంజాయి ఇతర మత్తుపదార్థాల నియంత్రణలో భాగంగా ప్రజలకు అవగాహన ఏర్పాటు….
సరైన ధ్రువపత్రాలు లేని 10 మోటార్ సైకిల్ లకు జరిమాన….

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు ఆత్మకూరు డిఎస్పి రామంజినాయక్ సూచనల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ నేరం నియంత్రణలో భాగంగా నేటి తెల్లవారుజామున ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి నీలి షికారి పేటలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.నందికొట్కూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షికారి పేట నందు ఆపరేషన్ వజ్రపహారి కార్యక్రమంలో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు.

రికార్డులు లేని జరిమానా విధించడంతో పాటు షీటర్లు, అనుమానితులు, నేర చరిత్ర గల వారి ఇల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది అని అన్నారు. నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరిక రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణ వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.సైబర్ నేరాలు పోక్సో చట్టం చైల్డ్ మ్యారేజెస్ మాదకద్రవ్యాలు వాటి వల్ల కలిగే నష్టాలు రోడ్డు భద్రత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, శక్తి యాప్ వల్ల ప్రయోజనాలు టోల్ ఫ్రీ నంబర్ లపై ప్రజలకు అవగాహన కల్పించారు.అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి, అనుమానితుల గురించి, ప్రజలు డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా.. అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు

Leave a Reply