ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు..

ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు..
- పనులను పరిశీలించిన బీజేపీ నాయకులు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని నూతన మున్సిపాలిటీ రోడ్డు వద్ద నిర్మాణం అవుతున్న సీసీ డ్రైన్ పనులను బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిసి డ్రైన్ పనుల వివరాలను కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్ మాట్లాడుతూ పరకాల నూతన మున్సిపాలిటీ దగ్గర నాయకుపువాని కుంటను అనుకోని సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారుల తమ ఇష్టానుసారంగ, నీటి నిల్వ స్థాయికి విరుద్ధంగా డ్రైనేజీ నిర్మిస్తున్నారని, ముఖ్యంగా గత నెల క్రితం అక్కడ సీసీ డ్రైనేజీ, కల్వర్ట్స్ నిర్మాణం చేపట్టారని, ఇప్పుడు అట్టి నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల మొద్దు నిద్ర, ఆలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని, ఇప్పుడు తిరిగి మళ్లీ ఈ కుంట నుండి వెల్లంపల్లి మెయిన్ రోడ్డు వైపు నిర్మిస్తున్నారు. సి సి డ్రైనేజ్ నిర్మిస్తున్న క్రమంలో, తాగునీటి కోసం మిషన్ భగీరథ పైపులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ కుంటలోని తూము ( పైప్ ల) ద్వారా బయటకు వచ్చే నీటిని కాలువ ద్వారా బయటకు పోయే విధంగా ప్రణాళిక చేయవలసిన అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ఒత్తిడితో వాటర్ లెవెల్స్ విరుద్ధంగా వారికి అనుకూలంగా తూతూ మంత్రంగా సిసి డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపట్టడమే కాకుండా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు.
పట్టణంలోనే పలు కాలనీలో జనావాసాల మధ్య సైడ్ డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు దోమలు, ఈగలు, దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా అధికార పార్టీ ప్రతినిధి పట్టించుకోకుండా ప్రణాళికలు లేకుండా అడ్డగోలుగా సిసి డ్రైన్ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్స్ కుక్కల విజయ్, బెజ్జంకి పూర్ణాచారి, ఆకుల లావణ్య శ్రీధర్, నాయకులు వేముల ఆంజనేయులు, పాలకుర్తి తిరుపతి, దామ సతీష్, మెంతుల సురేష్, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
