స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆదివారం పోటెత్తారు. రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. తొలుత నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షించారు. ఆలయ ఉద్యోగులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చూసారు.

Leave a Reply