సేవకు లభించిన గుర్తింపు..

సేవకు లభించిన గుర్తింపు..

ఇల్లెందు, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. అది వచ్చిన వారిలో వృత్తి పట్ల అంకితభావంతో నిస్వార్ధంగా సేవ చేస్తారు. అలా చేసిన వారిలో ఇల్లెందు వైద్య విధాన పరిషత్ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ హర్షవర్ధన్ ఒకరు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి సూరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి వైద్యశాల అభివృద్ధికి, రోగులకు వైద్య సేవలు అందించడంలో తోటి సిబ్బంది పట్ల మెలిగిన తీరుకు ఉత్తమ సూపరిండెంట్ గా అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగానే డాక్టర్ హర్ష వర్ధన్ జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Leave a Reply