ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ వ్యూహాత్మక మోసం

ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ వ్యూహాత్మక మోసం
- అడ్వకేట్, టీపీసీసీ నాయకులు పర్రెపాటి యుగంధర్
మోత్కూర్, ఆంధ్రప్రభ ; దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల లబ్ధి కోసమే బిజెపి పార్టీ వ్యూహాత్మక మోసానికి పాల్పడుతుందని టిపిసిసి నాయకులు అడ్వకేట్ పర్రేపాటి యుగంధర్ అన్నారు శనివారం ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 334ఏ సవరణ లోక్ సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2023 లో బిల్లుకు ఆమోదం తెల్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…. ఇప్పటికిప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేయాలనే హాడావిడి చేయడం ఎందుకు …? అనేది దేశంలో కనీస అవగాహన ఉన్న వారికికూడా తెలుసు.
దక్షిణాది లో ని 5 రాష్ట్రాల ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం అసెంబ్లీ ఎన్నికలను ఆసరాగా చేసుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం ఈ నెల 16,17,18 మూడు రోజులు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి బిల్లు ప్రవేశ పెట్టడం ఎంతవరకు సమంజసం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదయోగ్యమైనదే అయినప్పటికీ… కేవలం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎందుకు అనేది ప్రశ్న..?
ఏప్రిల్ 23 తమిళనాడు రాష్ట్రంలో ఒకే దఫా ఎన్నికలు,పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 23,29 రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో 16,17,18 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేసుకోవాలనేది దేశ ప్రజలపై బీజేపీ చేస్తున్నది వ్యూహాత్మక కుట్ర కాదా ? దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ మనుగడ లేకపోవడం ఒక కారణంగా చూస్తే… బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న ఇంకో రాష్ట్రం పశ్చిమ్ బెంగాల్ లో ఎన్నికలకు వారం రోజుల ముందు హడావుడిగా ఈ బిల్లు చేయడాన్ని బీజేపీది రాజకీయాలలో, దేశ ప్రజలను వ్యూహాత్మకంగా మోసం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలు అనుకోకుండా ఇంకో పదం ఉంటే బీజేపీలో ఉన్న మేధావి వర్గం దేశ ప్రజలకు వివరిస్తే బాగుంటుంది అనేది ప్రశ్న..?
అసలు ఇప్పుడు పార్లమెంట్ స్థానాల పునర్విభజన అవసరం ఉందా…?
దేశంలో తొలిసారిగా పార్లమెంట్ స్థానాల పునర్విభజన 1952 లో జరగగా… అప్పటి లెక్కల ప్రకారం దాదాపుగా 17 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే పార్లమెంట్ స్థానాల సంఖ్య 489గా ఉంది . అప్పటి నుండి నాలుగు సార్లు పార్లమెంట్ స్థానాలను పెంచారు.ప్రస్తుతం దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాల పెంపునకు అవసరమైన 550కి 7 స్థానాలు తక్కువగా ఉన్నాయి . రాజ్యసభలో కూడా 250 స్థానాలకు పెంచాల్సినప్పటికి 5 స్థానాలు తక్కువగా ఉండడంతో ప్రస్తుతం 245 స్థానాలు ఉన్నాయి.ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు పెంచడం కాకుండా… దేశంలోని అన్ని అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుకోవడంలోనే దేశం అభివృద్ధికి అత్యంత శ్రేష్కరంగా ఉంటుంది.
రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం అసెంబ్లీ లో సభ్యుల సంఖ్య 500 వరకు ఉండొచ్చు.అసెంబ్లీ స్థానాలు పెంపు మాత్రమే భారతదేశ ఆర్ధిక, రాజకీయం సమన్యాయ పద్ధతిలో ఉంటుంది. పార్లమెంటులో చట్టాలు చేయడానికి ఇప్పుడు ఉన్న సంఖ్య 543 పార్లమెంట్ స్థానాలు సరిపోతాయి. ఇలాకాకుండా పార్లమెంట్ స్థానాలను పెంచాలి అనుకోవడం మాత్రం దక్షణాది రాష్ట్రాలను బలహీనం చేసి… ఉత్తరాది మనువాద రాజకీయాలను దేశంపై బలవంతంగా రుద్దడమే అవుతుంది ఇదే కానీ జరిగితే ఒకప్పటి అఖండ భారత్ మతవాదుల పాలనలో ముక్కలు అయినట్లు… దేశం కాస్త… దక్షిణ భారత దేశంగా… ఉత్తర భారత దేశంగా విభజనకోసం ఉద్యమాలు మొదలవ్వడం ఖాయం.
ప్రస్తుతం భారతదేశం చుట్టూ యుద్ధాలు జరుగుతున్నాయి.ఓ పక్క దేశాల యుద్ధంతో నిత్యావసర ఖర్చులు,పెట్రోల్, డీజిల్,గ్యాస్, మందుల ధరలు అమాంతం పెరగడంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం గా మారి సామాన్యులకు గడ్డు పరిస్థితులు దాపురించేలా ఉంది. దేశంలో చివరికి కండోమ్స్ ధరలు కూడా పెరుగుతున్నాయని ఆర్ధిక నిపుణులు చెప్తుంటే …దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు మాత్రం సంగీతం వింటూ ,జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.ఇవ్వన్ని కూడా దేశ ఉన్నతికోసమే అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఇప్పటికిప్పుడు డిలిమిటేషన్ చేయకుంటే దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న అడ్డంకులు ఏమిటనేది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇచ్చిన హామీల అమలు మరిచి వాటిని అమలు చేయకుండా తప్పించుకునేందుకు కొత్త మోసాలకు బీజేపీ పార్టీ వ్యూహాలు పన్నుతున్నారు.ప్రాపగాండా సినిమాలు తీసి… ప్రజల మీద రుద్దడం మోడీ బోడ గుండు కూడా దేశం కోసం ధర్మం కోసం అని,చాతిని దాచుకుని బ్రతికే దేశంలో… ఇంచులతో కొలిచి మరీ ప్రచారం చేయడం, ఇలా ప్రతిదీ బీజేపీ రాజకీయ అధికారం కోసం ప్రజలను దేవుడు,భక్తి,ధర్మం ప్రకారం వాయిదాల పద్ధతిలో వ్యూహాత్మక మోసాన్ని చేసుకుంటూ 14 సంవత్సరాలుగా కొనసాగించుకుంటూ వస్తున్నారు.
నిజంగా రామాయణంలో రాముడు సతీసమేతంగా 14 సంవత్సరాలు వనవాసం చేసుకుని బ్రతికినది కథగా చదువుకున్న ఈ దేశ ప్రజలు… ప్రస్తుత బీజేపీ పాలనలో దేశ ప్రజల బ్రతుకు కూడా అలాగే ఉండేదని దీనిని రాయడానికి సైతం మరో వాల్మీకి నీ తయారు చేసి… అందులో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీని బూచిగా చూపించి… భవిష్యత్ లో నేటి కాలాన్ని చరిత్రగా లేదా మరో ఆధ్యాత్మిక కథగా రాసి కీర్తించగల వివేకం లేని ప్రజలుగా తయారు చేస్తున్నారు. అయిదు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలాగైనా ఉండొచు … కుటుంబం బలంగా ఉండాలి.. అంటే కుటుంబ పెద్ద ప్రాముఖ్యత ఎంత అవసరమో… దేశం కూడా బలంగా ఉండాలి అంటే …ప్రస్తుత దేశానికి నేటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం చారిత్రక అవసరమై ఎంతైనా ఉంది.
