Pharmacy | అరాచ‌న పాల‌న అంతానికి కొత్త‌త‌రం రావాలి

Pharmacy | అరాచ‌న పాల‌న అంతానికి కొత్త‌త‌రం రావాలి

Pharmacy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నంలో నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ… రేవంత్ అరాచ‌క పాల‌న‌ను అంతం చేయ‌డానికి కొత్త‌త‌రం రావాల‌న్నారు. ప్ర‌భుత్వం రైతుబంధు ఎగ్గొంట్టింద‌ని రైతులు అంటున్నార‌న్నారు.

మ‌హిళ‌లు, యువ‌త‌, రైతులకు ఇచ్చిన హామీలు గాలికొదిలేశార‌న్నారు. ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్ట‌డం త‌ప్ప రెండున్న‌రేళ్ల‌లో రేవంత్ చేసిందేమీ లేద‌న్నారు. ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తే రేవంత్ రెడ్డి వచ్చాక రద్దు చేశారన్నారు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారన్నారు. ఏఐ గ్రాఫిక్స్ తో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారన్నారు. మరో 50ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ సోదరులు భూదోపిడీ చేస్తున్నారన్నారు.

Leave a Reply