ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం

  • ప్రారంభిస్తున్న మాజీ ఎంపీపీ కొండయ్య

మక్తల్, ఆంధ్రప్రభ ; ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో క్రీడా పోటీలను మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య ప్రారంభించారు. ముందుగా భరతమాత చిత్రపటం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నమని తెలిపారు.

గ్రామీణ స్థాయి నుండి ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, క్రీడాభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని అన్నారు. ఈ క్రీడా పోటీలను మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, చివరగా పార్లమెంటు స్థాయిలో నిర్వహిస్తామని కొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి,మున్సిపల్ ఫోర్ లీడర్ బి.రాజశేఖర్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు దేవరింటి నరసింహారెడ్డి, కురువ హన్మంతు, కావలి వెంకటేష్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పికె.నరసింహ, కౌన్సిలర్ టప్ప కృష్ణ ,మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి , నాయకులు జయానందన్ రెడ్డి, నల్లెనరసప్ప, నారాయణ,పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేందర్, టప్ప అశోక్,అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నరసింహ, బీజేవైఎం జిల్లా నాయకులు మహేష్ సాగర్,పట్టణ నాయకులు విద్యాసాగర్, రాజశేఖర్ ,ఆంజనేయులు, మహదేవ్, రాకేష్, శ్రీధర్, బ్యాటరీ రాజు, చందాపూర్ రాము , కొండయ్య, నాగరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply